![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -158 లో....చక్రితో మహా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. దాంతో అన్నయ్య నాకొక హెల్ప్ చేస్తావా మహా నాకు విడాకులు ఇవ్వకుండా నువ్వే ఆపాలని మాధవతో చక్రి అనగానే నేను ఎలా అనగలనురా అని మాధవ అంటాడు. నీ ప్రేమ నిజం అయితే మీకు విడాకులు అవ్వవని మాధవ అనగానే చక్రి తనని హగ్ చేసుకుంటాడు. ఆ మాటలన్నీ నారాయణ వింటాడు. మహా రెడీ అయి విడాకులు రావాలని దేవుడికి మొక్కుకుంటుంది. ఇప్పుడు విడాకులు ఎందుకని మహాని నారాయణ అడుగుతాడు. ఇప్పుడు విడాకులు తీసుకోకుంటే ప్రాబ్లమ్ అవుతుందని మహా అంటుంది.
ఆ తర్వాత ఇద్దరు కోర్ట్ కి వెళ్లి జడ్జ్ ముందు నిల్చుంటారు. మీ ప్రాబ్లమ్ ఏంటి అని జడ్జ్ అడుగుతుంది. ఏం లేదని మహా చెప్తుంది. మరి ఎందుకు విడాకులు అని జడ్జ్ అడుగుతుంది. మేం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని మహా చెప్తుంది. అయితే విడాకులు ఇస్తావా పెళ్లి అంటే బొమ్మలాటలాగా ఉందా అని జడ్జ్ కోప్పడుతుంది. మీకు విడాకులు అసలు ఇవ్వను కావాలంటే ఆరు నెలల తర్వాత రండీ ఆలోచిస్తానని జడ్జ్ అనగానే చక్రి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఇద్దరు భోజనం చేస్తూ విడాకుల గురించి మాట్లాడుకుంటారు. విడాకులు వస్తే నాకు పార్టీ ఇవ్వాలి. ఎందుకు అంటే మన పెళ్లి వల్లే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ .. అప్పుడు మీరు ఫ్రీ బర్డ్ అవుతారని మహా అనగానే ఎంత బాగా అర్థం చేసుకున్నావ్ తల్లి అని చక్రి మనసులో అనుకుంటాడు. ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేసుకున్నా.. కూడా రెండో పెళ్లి అంటారు కదా అని మహ మాటలతో చక్రిని టార్చర్ పెడుతుంది.
మరొకవైపు అసలు ఏమైందో ఏంటోనని ఇంట్లో ఉన్న మాధవ వాళ్ళు టెన్షన్ పడుతారు. వాళ్ళ దగ్గరికి నారాయణ వస్తాడు. అతనితో కన్నా గొడవ పడుతాడు. తరువాయి భాగంలో మహా బర్త్ డే కి చక్రి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. కేక్ కట్ చేయిస్తాడు. తనకి సారీ గిఫ్ట్ ఇస్తాడు. ఆ సారి కట్టుకొని మహా వస్తుంది. తనను చూసి చక్రి ఫ్లాట్ అవుతాడు. అసలు ఆ రోజు స్టేషన్ లో ఏం జరిగిందో కానిస్టేబుల్ ని అడగాలని మహా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |